![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. ఓటింగ్ లో లీస్ట్ గా ఉంటూ డేంజర్ జోన్ లో ఉన్న ఇనయా, ఒక్కసారిగా తన పర్ఫామెన్స్ తో గ్రాఫ్ పెంచుకొని టాప్ ఫోర్ లోకి వచ్చేసింది. కారణం తను గేమ్ బాగా ఆడటం. అయితే తను నిన్న మొన్నటి వరకు గొడవలు పడి, ఇప్పుడు కొందరితో కలిసిపోతుండటం ప్రేక్షకులను అయోమయంలో పడేస్తోంది. కారణం ఫైమా, ఇనయా నిన్నటి వరకు ప్రతీ విషయంలో గొడవ పడుతూ, వస్తున్నారు. కానీ నిన్న కొత్తగా ఫైమా కెప్టెన్ అయ్యాక ఇనయా కలిసిపోయింది.
ఇనయాని ఫేక్ అని అనేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ నిన్న జరిగిన టాస్క్ లో ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్య అందరు కలిసి రోహిత్ ని టార్గెట్ చేసి ఆడారు. ఈ విషయం ఇనయా స్పష్టంగా సంచాలకుడిగా ఉన్న రేవంత్ కి చెప్పినా అతను పట్టించుకోలేదు. దీంతో తను "నిన్న మొన్నటిదాకా గీతు ఉంది. ఇప్పుడు మీరు తయారు అయ్యారా" అని అంది. దాంతో " ఆదిరెడ్డి అనేవాడు తప్పు చేయడు. తప్పుగా ఆడడు" అని ఆదిరెడ్డి అన్నాడు. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, హౌస్ లో అందరూ ఒకవైపు, ఇనయా మరోవైపు అని తెలుస్తోంది. తనకి ఎవరి సపోర్ట్ లేకున్నా గేమ్ లో గెలవగలదు అని ప్రతీసారి ఋజువు చేస్తుంది. కానీ గేమ్ లో టీం సపోర్ట్ ఉండాలి. టీం సపోర్ట్ లేకుండా ఎంత పోరాడిన గేమ్ లో గెలవలేరు. ఇనయా ఒంటరిగా పోరాడుతూనే ఉంటోంది. తన బలహీనత ఒక్కటే..ఎవరైనా రెచ్చగొడితే మాటలు జారడం కామన్. అది అయిపోయాక క్షమాపణలు చెప్పడం.
హౌస్ మేట్స్, ఇనయాని ఫేక్ అని అనుకుంటున్నారు. కానీ తను ఒక్కతే రియల్ గేమ్ ఆడుతోంది. నిజానికి హౌస్ లో ఉండాలంటే ధైర్యంగా గేమ్ ఆడాలి. ఎవరి తప్పు ఉన్నా చెప్పాలి. అలా లేదంటే కామ్ గా గేమ్ చూస్తూ కూర్చోవాలి. అయితే ఇనయా టాస్క్ లలో బాగా పర్ఫామెన్స్ ఇస్తూ వస్తోంది. తన దగ్గర ఉన్న మైనస్ ఒక్కటే.. ఏదైనా గొడవ జరిగితే దాన్ని అలాగే సాగదీయడం. అలా సాగదీయడం వల్ల చూసే ప్రేక్షకులకు చిరాకు వస్తుంది. ఇనయా గేమర్. ఏ గేమ్ లో ఎవరు, ఎవరికి సపోర్ట్ చేస్తారో అన్ని తెలుసుకొని తన అవకాశం రాగానే ఉపయోగించుకుంటుంది. తను నోరు అదుపులో పెట్టుకుంటే టాప్ త్రీలో ఉండే అవకాశం ఉంది.
![]() |
![]() |